AP: ఈనెల 21 నుంచి 9 మంది మంత్రులు సింగపూర్లో పర్యటించనున్నారు. పరిపాలన, లా అండ్ ఆర్డర్, రోడ్లు, పర్యాటకాన్ని మంత్రులు పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్ వెళ్లే మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. నారాయణ, పయ్యావుల, అనగాని, సత్యకుమార్, జనార్దన్ రెడ్డికి దిశానిర్దేశం చేశారు. సింగపూర్ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.