MLG: వెంకటాపురంలో హెచ్ఐవి/ఎయిడ్స్‌పై అవగాహన కోసం రెడ్ రిబ్బన్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. హెచ్ఐవి వ్యాప్తి మార్గాలు, నివారణపై డాక్టర్ శివాజీ ప్రజలకు వివరించారు. పరీక్షలు, ముందస్తు జాగ్రత్తలతో ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు.