TG: HYD చంచల్గూడ జైలులో మూడు రోజుల వైద్య శిబిరాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. ముఖ్యంగా ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి స్పెషలిస్ట్ డాక్టర్లతో జైళ్లలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా HIV అవేర్నెస్, స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు.