SDPT: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పట్టణ ప్రగతి, ప్రణాళికలో భాగంగా సిద్దిపేట జిల్లా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 10న ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు ఆయుర్వేదిక్ మెడికల్ అధికారిని ఉమాదేవి తెలిపారు. సిద్దిపేట మెడికల్ కళాశాల వద్ద ఉన్న నూతన 50 పడకల ఆయుష్ ఆసుపత్రిలో వైద్య శిబిరం ఉంటుందన్నారు.