TG: రాష్ట్రవ్యాప్తంగా వరి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వేసవిని దృష్టిలో ఉంచుకొని రైతులకు ఇబ్బందులు కలగకుండా 8,251 కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. కొనుగోలు చేసిన 2 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. అలాగే సన్నవడ్లకు క్వింటాల్‌పై రూ.500 బోనస్ కూడా అందించనుంది. ఈ సీజన్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.