NLG: చింతపల్లిలో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ICDS) శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బాలునాయక్ అంగన్వాడీ టీచర్లకు 5జి స్మార్ట్ ఫోన్లను ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఈ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నదని తెలిపారు.