WGL: ఎన్ఐటీ వరంగల్ 2026-27 విద్యా సంవత్సరానికి ఎం.టెక్(సెల్ఫ్ ఫైనాన్స్) కోర్సుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈనెల 25 దరఖాస్తుకు చివరి తేదీ కాగా.. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు మే 28 నుంచి జూన్ 3 వరకు జరుగుతాయి. మొదటి విడత ఎంపిక జాబితా జూన్ 5న విడుదల అవుతుంది. అర్హత ఉన్న అభ్యర్థులు గడువులోగా అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచించింది.