AP: కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి వద్ద విషాదం చోటుచేసుకుంది. పెన్నా నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టగా, ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. బాధితులు కడప నగరానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.