GNTR: ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఏ.ఎస్. దినేష్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని ప్రధాన కార్యాలయంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ఆయన 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా సేవలందించారు. అక్కడి నుంచి ఆయనకు ఏపీఐఐసీ ఎండీగా పదోన్నతి లభించింది.