HNK: నారాయణగిరి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ పుట్ట రేణుక కుమారస్వామి, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుతుందని, అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జీపీ సెక్రటరీ హిమవంత్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.