KMM: మధిర 21వ వార్డులో ఉన్న RCM చర్చ్‌కు చెందిన సమాధుల స్థలానికి రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ సోమవారం చర్చ్ సంఘ పెద్దలు తహసీల్దార్ రాంబాబును కలిసి వినతి పత్రం అందించారు. ప్రస్తుతం ఎవరైనా మరణించితే సమాధుల స్థలానికి వెళ్లేందుకు రైల్వే రాక్ దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. దీని కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.