MNCL: జన్నారం మండలంలో అక్రమార్కుల ఆగడాలు పరాకాష్టకు చేరాయి. అధికారుల అండతోనే అటవీ సంపద, ఇసుక దోపిడీ అడ్డుఅదుపు లేకుండా సాగుతోందని స్థానికులు మండిపడుతున్నారు. కవ్వాల్ టైగర్ జోన్లో టేకు కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతున్నాయన్నారు. భారీగా అందుతున్న పర్సంటేజీల వల్లే అధికారులు మౌనం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.