NLG: యాసంగి సీజన్లో వరి కోతలు ప్రారంభమై 15 రోజులు దాటినా నకిరేకల్ మండలంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. మండలంలోని 14 సెంటర్లకు గాను కేవలం 4 సెంటర్లను మాత్రమే ఇప్పటివరకు ప్రారంభించడం వలన మిగతా చోట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.