PDPL: ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోర్టులో ప్రతిమ ఫౌండేషన్ చే ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంను జడ్జి ప్రారంభించారు. సుమారు 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.