NZB: కొండాపూర్ గ్రామంలో మంగళవారం ఉదయం ఉమ్మడి గ్రామ సర్పంచ్లు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తాపీ మేస్త్రి లతో సమావేశం నిర్వహించి అనుమతి లేనిదే ఇళ్ల నిర్మాణం చేపట్టరాదని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇతరుల ఇళ్ల రేట్లు విషయంలో చర్చించడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఉమ్మడి గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, గ్రామ కమిటీ సభ్యులు ఉన్నారు.