RR: జిల్లాలో బస్సుల కొరతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహాలక్ష్మి పథకంతో రద్దీ పెరిగినా సర్వీసులు పెరగలేదు. ఇబ్రహీంపట్నం, మియాపూర్, కూకట్పల్లి మార్గాల్లో కిక్కిరిసిన ప్రయాణాలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు పుట్‌బోర్డు ప్రయాణాలు చేస్తున్నారు. పీక్ అవర్స్‌లో అదనపు బస్సులు నడపాలని ప్రజలు, ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.