ADB: భీంపూర్ మండల బీఆర్ఎస్ నాయకులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కలిశారు. CM రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా బజార్హతనూర్ మండలం పిప్పిరి గ్రామంలో జరిగే కార్యక్రమంలో జందాపూర్ నుంచి గుబిడి వరకు నిలిచి పోయిన రోడ్డు పనులకు నిధులు విడుదల చేసేలా చూడాలని కోరారు. రోడ్డు కష్టాలను ముఖ్యమంత్రికి వివరించి కష్టాలను గట్టెక్కించాలని ఎమ్మెల్యేకు విన్నవించారు.