సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ లైసెన్స్ పునరుద్ధరణ కాకపోవడంతో, బాధ్యతలు ఎన్పీడీసీఎల్కు అప్పగించబడ్డాయి. గత ఐదు రోజులుగా క్షేత్రస్థాయిలో నాణ్యమైన విద్యుత్ సేవలు అందిస్తున్నామని ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. ఇవాళ విద్యుత్ సబ్స్టేషన్లను తనిఖీ చేశారు. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యమన్నారు.