KRNL: పెద్దకడబూరు మండలం కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న సీఎస్ఐ ఆలయ నిర్మాణం కోసం గ్రామానికి చెందిన గుమ్మల రాజేష్ దంపతులు రూ. లక్ష విరాళం అందజేశారు. ఈస్టర్ సందర్భంగా స్థానిక సంఘ కాపరి ముత్తు మనోహర్ బాబుకు విరాళం మొత్తాన్ని అందజేశారు. చర్చి అభివృద్ధికి భక్తుల సహకారం ఎంతో అవసరమని పాస్టర్ పేర్కొన్నారు. రాజేష్ దాతృత్వాన్ని అభినందించారు.