ASF: వాంకిడి మండల కేంద్రంలో ఈనెల 5న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డా. ప్రభాస్ ఫౌండేషన్, వివేకానంద సేవా సమితి, బీవీఆర్. హాస్పిటల్ నిర్వాహకులు శనివారం ప్రకటనలో తెలిపారు. బీసీ. కమ్యూనిటీ హాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మండల ప్రజలు ఉచిత కంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలన్నారు.