MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన అంశంపై టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలని, గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.