TG: ప్రైవేట్ కంటే ప్రభుత్వ స్కూళ్లలోనే నాణ్యమైన విద్య అందుతుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట PRTU టెన్త్ టాపర్స్ అవార్డుల సభలో ఆయన మాట్లాడారు. జిల్లాను టెన్త్ ఫలితాల్లో మొదటి స్థానానికి చేర్చాలని కోరారు. బడులు తెరవగానే పుస్తకాలు, కిట్లు ఇస్తున్నామని, డైట్ ఛార్జీలు పెంచామని చెప్పారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.