NTR: విజయవాడలో జరిగిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సన్నద్ధత సమావేశంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ కార్యదర్శులు సంతోష్ కుమార్ దూబే, నవీన్ కుమార్ ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించాలని సూచించారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్వోల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి అర్హుల పేర్లు చేర్చడం జరుగుతుందన్నారు.