కడప నగరంలోని బుగ్గ వంక పరివాహక ప్రాంతంలో 5 ఏళ్ల సయ్యద్ యూసఫ్ నీటి గుంతలో పడి మృతి చెందాడు. షామీరియా బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో చేపలు పట్టేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. బాలుడిని రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మాజీ మేయర్ పాక సురేష్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.