CTR: చిత్తూరు వన్‌టౌన్, టూటౌన్ పోలీస్స్టేషన్ల పరిధిలో గతంలో అక్రమ లాటరీ టికెట్ల విక్రయాలకు పాల్పడి కేసులు నమోదైన 18 మందికి చిత్తూరు ఎస్డీపీవో జె.వెంకటనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. అక్రమ లాటరీలు చట్ట వ్యతిరేకమని, మళ్లీ ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు.