ముల్లాన్‌పూర్ వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 214/6 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (96) తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. జడేజా (45*), ఫెరీరా (38*) పరుగులతో రాణించారు. జైస్వాల్ (1), జురెల్ (7), పరాగ్ (11), శనక (3) నిరాశపర్చారు. గుజరాత్ బౌలర్లలో హోల్డర్, రబాడ చెరో రెండు వికెట్లు తీశారు.