TG: పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు MLAలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ, సొంత ప్రచారంతో డబ్బా కొట్టుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా సొంత డబ్బా ఆపేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రమోట్ చేయాలని, సోషల్ మీడియా ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నాయకులకు సీఎం స్పష్టం చేశారు.