AP: రాష్ట్ర కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న వాటికి అదనంగా మరో 20 కార్మిక సౌకర్యాల సముదాయాల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే తిరుపతి, విజయవాడ, విశాఖలో పైలట్ ప్రాతిపదికన వీటి ఏర్పాటుకు కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. తాజాగా రాజమహేంద్రవరం, నెల్లూరులో మరో 2 ILACలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పీపీపీ విధానంలో వీటి నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.