HNK: హసన్పర్తి మండలం సుదనపల్లి గ్రామంలో MGNREGS నిధులతో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, అంగన్వాడీ భవనాన్ని MLA కేఆర్ నాగరాజు, కుడా ఛైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డితో కలిసి ప్రారంభించారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. రహదారులతో రాకపోకలు సులభతరం అవుతాయని, అంగన్వాడీ ద్వారా మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు.