NTR: కలెక్టరేట్లో ఈ నెల 6న సోమవారం “మీకోసం” పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. రెవెన్యూ సమస్యల కోసం రెవెన్యూ క్లినిక్‌లు కూడా నిర్వహిస్తారు. Meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చన్నారు.