BDK: దుమ్ముగూడెం మండలం మానగట్ట గ్రామాన్ని తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీ నాయకులు సందర్శించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిశీలించి, తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుడందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలెంకోటి మాట్లాడుతూ.. గ్రామంలో ఆదివాసీ హక్కులు, చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించామని తెలిపారు.