MHBD: మరిపెడ మున్సిపాలిటీ 5,11వ వార్డుల్లో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ ఛైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రజలు తమ ఇంటి పరిసర ప్రాంతాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకుంటూ రోగాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.