HNK: ఇచ్చిన మాట ప్రకారం పనులు పూర్తి చేస్తేనే మళ్లీ ఓటు అడుగుతామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. 54వ డివిజన్ పరిధిలోని అపూర్వ కాలనీలో రూ. 50 లక్షల వ్యయంతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.