చాలా మంది ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగుతుంటారు. అయిేతే, ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపులోని జీర్ణరసాలు పలచబడతాయి. దీనివల్ల ఆహారం సరిగ్గా అరగకపోవడంతో పాటు కడుపు ఉబ్బరం, గ్యాస్, జీర్ణ రుగ్మతలు, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆపిల్ తిన్న తర్వాత 30 నుంచి 60 నిమిషాల వరకు నీళ్లు తాగకపోవడమే ఉత్తమం. ఒకవేళ తప్పనిసరి అయితే ఒక గుక్కెడు నీళ్లు మాత్రమే తీసుకోవాలి.