BPT: సంతమాగులూరు శాఖ గ్రంథాలయాన్ని ఇవాళ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సభ్యురాలు ఎం.పద్మజా ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో నిర్వహణ, రికార్డులను పరిశీలించిన ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రంథాలయ అభివృద్ధికి సంబంధించిన పలు సూచనలు, సలహాలను ఆమె అందించారు. ఈ తనిఖీలో గ్రంథపాలకులు బాదం విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.