గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం కాగా.. ఐటెం సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాట షూటింగ్‌ను ఏప్రిల్ 9న స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నట్లు, ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు టాక్.