TG: ఆదిలాబాద్ జిల్లా మీద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘ఈ జిల్లా ప్రజలు అమాయకులే కాదు.. నిరంకుశత్వం మీద పోరాడిన వీరులు. కుమురంభీం వంటి ఆదివాసీ వీరులు.. నిజాం నిరంకుశత్వంపై పోరాడారు. ఆధునిక విద్య, వైద్యం వంటి సదుపాయాలు ఇంకా ఈ జిల్లాకు దక్కలేదు. మనిషి ఇచ్చే మాట మీద విశ్వాసం ఉండేలా.. మాట నిలబెట్టుకోవాలి’ అని పేర్కొన్నారు.