NGKL: అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న AUPS ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సోమవారం పున:ప్రారంభించారు. గతంలో పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారడంతో పట్టణానికి చెందిన రాజు అనే వ్యక్తి పాఠశాలను దత్తత తీసుకొని సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.