టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఇన్స్టా స్టోరీ చర్చనీయాంశంగా మారింది. నెట్ఫ్లిక్స్, MI లోగోలతో ఉన్న కాపీని పోస్ట్ చేశాడు. అందులో జెర్సీ నంబర్ 45, అలాగే రోహిత్ పేరు పక్కన ఇవాళ్టి తేదీ ప్రింట్ చేసి ఉంది. ఈ ఫొటో చూసిన వారంతా నెట్ఫ్లిక్స్ రోహిత్ బయోపిక్ తీస్తుందా? లేదా ఇంకా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నారా? అని నెట్టింట ప్రశ్నల వర్షం కురుస్తోంది.