అన్నమయ్య: మదనపల్లిలో అత్యాధునిక జిల్లా క్రైమ్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రారంభించారు. పెండింగ్ కేసుల వేగవంతమైన పరిష్కారం, ఆస్తి నేరాల ఛేదన కోసం ఈ స్టేషన్ కీలకంగా పనిచేస్తుందని తెలిపారు. టెక్నాలజీ ఆధారంగా నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.