ASF: ఆసిఫాబాద్లో ప్రజా సంఘాల కార్యాలయంలో రాంజీ గోండు వర్ధంతిని గురువారం నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు రాంజీ గోండు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలు, గిరిజనుల హక్కుల కోసం చేసిన పోరాటాన్ని నాయకులు స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, గిరిజనుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.