SRCL: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం విద్యార్థులకు అల్పాహారం ఇచ్చే సమయం కావడంతో జిల్లా కలెక్టర్ ముందుగా మెనూ చార్ట్ పరిశీలించారు. నేరుగా డైనింగ్ రూమ్ వద్దకు చేరుకొని.. ప్లేట్ తీసుకుని విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు.