NZB: ఆలూర్ మండలం మిర్దపల్లిలో శ్రీ భవానీ శంకర దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. మాధవానంద, కేదారానంద స్వామిజీల ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, జలాధివాసం నిర్వహించారు. 11న పార్థివ లింగార్చన, 12న చండీ హోమం, 13న ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్టాపనతో పాటు కళ్యాణ వేడుకలు జరుగుతాయని ఆలయ కమిటీ తెలిపింది.