MHBD: ప్రజావాణిలో అందజేసిన ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్లతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.