TG: ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పిప్రిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. తాను ప్రారంభించిన పీపుల్స్ మార్చ్‌కు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పిప్రిలో ప్రారంభించి ఖమ్మం జిల్లా వరకు పాదయాత్ర చేపట్టారు.