BHNG: బీబీనగర్ మండలం వెంకీర్యాల కాంప్లెక్స్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. కాంప్లెక్స్ హెచ్ఎం జోసెఫ్ ఆధ్వర్యంలో 3 నుంచి 8 తరగతుల విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించి, బహుమతులు అందజేశారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఇలాంటి టెస్టులు ఉపయోగపడతాయని, భవిష్యత్తులో మరింత పోటీతత్వం అలవాటు చేసుకుంటారని తెలిపారు.