WNP: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ అప్రూవల్ రాలేదని పేరుతో రోగులకు అత్యవసర సేవలు ఆపవద్దని వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగులను, అత్యవసర కేసులను వేరే ఆసుపత్రికి రిఫర్ చేయకుండా ఉండేందుకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.