మంచిర్యాల జిల్లాలో గంజాయి, డ్రగ్స్ బారిన పడిన యువతను కాపాడడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని DCP భాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణపై నార్కోటిక్ టీమ్ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కౌన్సిలింగ్ ఇచ్చినా పద్ధతి మార్చుకోని గంజాయి విక్రేతలపై PD యాక్ట్ నమోదు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 300 మందిపై సస్పెక్ట్ షీట్ నమోదు చేశామన్నారు.