జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామ అంగన్వాడీ-1 కేంద్రంలో మంగళవారం చిన్నారులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ బత్తిని రవీనా ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు కోడిగుడ్లు, బాలామృతం ప్యాకెట్లను అందజేశారు. పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తోందని ఆమె తెలిపారు.