TG: దేశంలో తాను ఎక్కడైనా కాలుపెడతానని.. అడ్డుకోవడానికి మీరెవరని కాంగ్రెస్ నాయకులను పవన్ ప్రశ్నించారు. ‘నిరుద్యోగం, ఆరు గ్యారంటీల గురించి కాంగ్రెస్ వాళ్లు మాట్లాడాలి. దమ్ముంటే నేను TGకు రావొద్దని కాంగ్రెస్ నేతలు తీర్మానం చేయాలి. ప్రియాంక, రాహుల్ ఉత్తరాది నుంచి వచ్చి పోటీ చేసేటప్పుడు.. నన్ను రావొద్దు అనడానికి మీరెవరు’ అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.